Andhra PradeshEast GodavariNews

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

కోస్తాఎన్కౌంటర్, కపిలేశ్వరపురం:మండల పరిధి గ్రామాలలో గురువారం ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.అంగర పల్లపు వీధిలో దేవీ నవరాత్రి నాలుగోవ వార్షికోత్సవం పురస్కరించుకొని పురోహితులు వారణాసి వెంకటేశ్వరరావు,సంతోష్ కుమార్ పర్యవేక్షణలో అమలాపురం టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ దంపతులచే పూజలు నిర్వహించారు.అలాగే పితాని చెరువు గట్టు పై శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయంతో పాటు కాలేరు, వెదురుమూడి,కపిలేశ్వరపురం,వల్లూరు, నేలటూరు, కోరుమిల్లి,కేదార్లంక,టేకి తదితర గ్రామాల్లో భక్తిప్రపత్తులతో అమ్మవారి పూజలు జరిపారు.భవాని మాల ధరించిన భక్తులు దేవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కోవిడ్ నివారణ నిబంధనల మేరకు ఉత్సవాల నిర్వహణ నిర్వహిస్తున్నట్లు ఆయా ఆలయాల ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆయా గ్రామాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comment here