Andhra PradeshEast GodavariNews

ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

కోస్తా ఎన్ కౌంటర్, రాయవరం: మండలంలోని వెదురుపాక గీత జ్ఞాన మందిరం లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందిరం నిర్వాహకులు సత్తి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేకువజామున నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణ పరమాత్మ కు అభిషేకాలు, తులసి దళాలతో అష్టోత్తర శత నామాలతో పూజలు చేశారు.అంగర జనార్ధనాచార్యులు ఆధ్వర్యంలో గీతా యజ్ఞం జరిగింది. మేడపాటి వెంకట రెడ్డి ,వీర లక్ష్మి దంపతులు గీతా యజ్ఞం లో పాల్గొని పూజలు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి, శివ మణికంఠ రెడ్డిల ఆధ్వర్యంలో మహిళలు భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ చేశారు. సాయంత్రం ఆనందోత్సాహాలతో ఉట్టి కొట్టారు. అధిక సంఖ్యలో భక్తులు గీతా మందిరానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
         *రాయవరం లో..*
వాసుదేవ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యాకల వీరభద్ర రావు దంపతులు, యాకల వెంకట రామకృష్ణ దంపతులు పీటల పై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజాము నుండి కృష్ణ పరమాత్మ కు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం ఆనందోత్సాహాలతో ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు యాకలసూర్యనారాయణమూర్తి,పైలా తిరుమల రావు, దేశపు వెంకటనారాయణ,గడదాసి శేషగిరి, అంజి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comment here