Andhra PradeshEast GodavariNews

చింతమనేని అరెస్ట్ అన్యాయం  టిడిపి నాయకులు.

చింతమనేని అరెస్ట్ అన్యాయం  టిడిపి నాయకులు.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం.   దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం అక్రమం, అన్యాయం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్. జయ్యవరపు శ్రీరామ్మూర్తి అన్నారు.సోమవారం జగ్గవరం వారి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,దెందులూరు లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, అధిక ధరలకు నిరసన గా చింతమనేని ఆందోళన చేస్తే, పోలీసుల విధులు అడ్డుకున్నారనే తప్పుడు కేసు బనాయించారని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా లోని దారకొండ ప్రాంతంలో పూజలు నిర్వహించడం చింతమనేని చేసిన తప్పా అని ప్రశ్నించారు. మావోఇస్టుల ప్రాంతమని,అక్కడ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందంటూ తప్పడు కేసులు పెట్టేందు కు దారులు వెదుకుతున్నారని అన్నారు. జగమోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ రాష్ట్రం లో ముఖ్యమైన తెలుదేశం నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. చింతమనేని ని భేషరతు గా విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తి వేయాలని జాయ్యవరపు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీ నర్సాపురం మాజీ జెడ్పీటీసీ సభ్యులు. నల్లూరి వెంకట చలపతి రావు,జగ్గవరం సొసైటీ మాజీ అధ్యక్షులు.బొంతు సత్యనారాయణ, సీనియర్ నాయకులు.జయవరపు వెంకటేశ్వరరావు,జగ్గవరం గ్రామ ఉపసర్పంచ్.భీమవరపు జగన్ మోహన్ రావు, తెలుగుదేశం పార్టీగ్రామ కమిటీ అధ్యక్షులు జయ వరపు.శ్రీనివాసరావు, అద్దంకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Comment here