Andhra PradeshEast GodavariNews

చిన్నారులతో చదువుల తల్లీకి ప్రత్యేక పూజలు 

ఆరో రోజున సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఈతకోట కనకదుర్గమ్మ
చిన్నారులతో చదువుల తల్లీకి ప్రత్యేక పూజలు
కోస్తా ఎన్ కౌంటర్. రావులపాలెం. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అమ్మవారుల ఆలయాల వద్ద దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో మహిళలు దేవిని ఆరాధిస్తున్నారు దసరా ఉత్సవాలలో ఆరో రోజైన మంగళవారం మూల నక్షత్రంలో ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు సరస్వతీ దేవిగా దుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చారు మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆలయ అర్చకులు ఖండవల్లి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో దుర్గాదేవి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని సరస్వతి దేవి రూపంలో  అలంకరించారు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పూజా సామగ్రిని ఏర్పాటు చేసి చిన్నారులతో చదువుల తల్లి సరస్వతీ దేవికి పుస్తకాలు పెన్నలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు చుట్టుపక్కల  గ్రామాల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు భక్తులు దుర్గమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకున్నారు

Comment here