Andhra PradeshEast GodavariNews

“చిలుకూరికి ప్రతిభా ఉపాధ్యాయ పురస్కారం”

“చిలుకూరికి ప్రతిభా ఉపాధ్యాయ పురస్కారం”
కోస్తా ఎన్ కౌంటర్, కడియం; …
కడియం ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావుకు
రాష్ట్ర హోమ్ శాఖామంత్రి మేకతోటి సుచరిత ప్రతిభా ఉపాధ్యాయ పురస్కారం అందించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గుంటూరు ఏ.ఎస్. కన్వెన్షన్ హాల్ లో జరిగిన “సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర” అన్న అంశంలో పిల్లల్లో నైతిక విలువలు, మానసిక స్థాయి అన్న విషయం పై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారం అందించారు. స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టుబాకో  బోర్డు జాతీయ ఎక్షికూటివ్ డైరెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ బాబు, స్పందన చైర్మన్ శామ్యూల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Comment here