Andhra PradeshEast GodavariNews

చేతకాని జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలపై విద్యుత్ భారం • •

చేతకాని జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలపై విద్యుత్ భారం • •
రాజన్నబిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ బిల్లులు బాదుడే బాదుడు
 రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు
 బండారు సత్యానందరావు
 కోస్తా ఎన్ కౌంటర్, కొత్తపేట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ   అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో  కరెంటు చార్జీలు అధికంగా పెంచుకుంటుతున్నారు ఇప్పటికే ఆరు సార్లు కరెంటు చార్జీలు పెంచి పేద ప్రజలపై భారం మోపారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జ్
బండారు సత్యానందరావు
విమర్శించారు.
విద్యుత్ రంగంపై సరైన ప్రణాళిక లేక విద్యుత్ రంగాన్ని పటిష్ట పరచకుండా పేద ప్రజలను ఆర్ధిక కష్టాలపాలు చేస్తున్నారని వైసీపీపై ఆయన మండిపడ్డారు కొత్తపేట మండలం పరిధిలోని వాడపాలెం గ్రామంలో గురువారం ఉదయం బండారు స్వగృహంలో మాట్లాడుతూ
 తెలుగుదేశం ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  హయాంలో అయిదు సంవత్సరాల పదవికాలంలో పదివేల మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెంచడం జరిగిందన్నారు.
 జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  రెండున్నరేళ్ళలో కేవలం  9 వందలు మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి పెంచటం జరిగింది
తెలుగుదేశం ప్రభుత్వంలో  ఒక్కసారి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదని సత్యానందంరావు పేర్కొన్నారు.
జగన్ చేతగాని ప్రభుత్వం వల్ల విద్యుత్ కోతలు
లేదా క్వాలిటీ విద్యుత్ అందించలేకపోవడం ఈ రెండున్నర ఏళ్లలో జరుగుతూ వస్తోందన్నారు
 విద్యుత్ రంగాన్ని నడిపించ లేక చేవలేక చేతకాక విద్యుత్ చార్జీలు పెంచుకుంటూ పోతున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
ఆరోజు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేస్తూ విద్యుత్ కొనుగోలులో దోపిడీ జరుగుతోందని దానిని అరికట్టి ప్రజలకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పి
సోలార్ విద్యుత్తు , ఇండో కంపెనీ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారు.
దాని ఫలితం ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజలపై 11,162 కోట్లు భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు
పవర్ కార్పొరేషన్ ద్వారా 24 వేల కోట్లు రుణం తీసుకోవడం జరిగింది.
విద్యుత్ దోపిడిని ,  దుబారా తగ్గించి అవినీతిని అరికట్టి పేద ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ అందించాలని బండారు డిమాండ్ చేశారు.

Comment here