Andhra PradeshEast GodavariNews

జగనన్న పాలన మహిళలకు శ్రీరామారక్ష

జగనన్న పాలన మహిళలకు శ్రీరామారక్ష
“మునిసిపల్ చైర్మన్ సుధాబాలు”
కోస్తా ఎన్కౌంటర్-తుని
రాష్ట్ర ప్రభుత్వం అమలుజేస్తున్న ప్రతి పథకంలో  మహిళమణులను భాగ్యాస్వాములను జేసి మహిళా సాధికారతకు,అభివృద్ధికి  కృషిజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  మహిళలు మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పాలన మహిళలుకు శ్రీరామరక్షగా నిలుస్తోందని మునిసిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు కొనియాడారు. మంగళవారం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు సందర్భంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు, నియోజకవర్గ యువత అధ్యక్షుడు ఏలూరి బాలు, కౌన్సిల్ సభ్యులుతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం జేశారు. ఈసందర్భంగా బాలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి మహిళా పక్షపాతంతో సంక్షేమ పథకాలు అమలు జేస్తున్నారని ఎక్కడ మహిళలు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా కుటుంబ శ్రేయస్సుకు తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు. పట్టణంలో అక్కచెల్లిలుకు 21కోట్ల రూపాయలు ఆసరాగా అందిస్తున్నారని ప్రతి మహిళా
ఈఅవకాశం సద్వినియోగం చేసుకుని కుటుంబ అభివృద్ధికి కృషి చెయ్యాలని ఆకాంక్షించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డిన్నీ కొనియాడారు. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆశీస్సులుతో అభివృద్ధి జేస్తామని ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం చైర్మన్ సుధాబాలును మహిళలు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో సీసీఎం శ్రీదేవి, 11,13,14,15,24,26,వార్డు కౌన్సిల్ సభ్యులు షేక్ క్వజా, కనిగిరి వెంకటరమణ, దారేశ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు సాపిరెడ్డి శేషమని,పార్టీ సీనియర్ నాయకులు అనిశెట్టి సూర్య చక్ర రెడ్డి,మర్రా దాసు, సురేష్,గణేష్,నాని, డ్వాక్రా మహిళలు, సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Comment here