Andhra PradeshEast GodavariNews

జడ్పిటిసి సుడిగాలి పర్యటన.

జడ్పిటిసి సుడిగాలి పర్యటన.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలో జెడ్ పి టి సి సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల దేవి పేట సచివాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ప్రజలు తెలిపిన సమస్యలకు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు అధికారులతో సత్ప్రవర్తన కలిగి సమస్యలు పరిష్కరించుకోవాలని పరిష్కారం కాని సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment here