Andhra PradeshEast GodavariNews

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరగాలి

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని కపిలేశ్వరపురం,నేలటూరు గ్రామాల సర్పంచులు సాకా శ్రీనివాస్,కుక్కల వీరన్న అన్నారు.శుక్రవారం ఆయా గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించారు.ఈ సందర్భంగా 2022- 23 వార్షిక  ప్రణాళిక పనులకు సంబంధించి గ్రామాల్లో గుర్తించిన పనుల జాబితా టెక్నికల్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు.వీటిలో కపిలేశ్వరపురంలో 90 పంట కాలువలు,2 చెరువులు,4మట్టి రోడ్లు, నేలటూరులో38 పంట బోదెలు,రెండు చెరువులు,4 మెడెప్స్ ,8 పుంత రోడ్లు పనులను గుర్తించామని క్షేత్ర సహాయకులు నాగూరు,కే.సత్తిబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగాని నూకరాజు, ఎంపీటీసీ సభ్యులు శీలం భాస్కర్ రావు,రుద్రాక్షల వీర గౌరీ కుమారి,వైసిపి గ్రామ కమిటీ అధ్యక్షులు కట్టా మురళి,శనక్కాయల దొరబాబు, పంచాయతీ కార్యదర్శులు దుర్గాప్రసాద్, సుధారాణి,మేట్లు,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Comment here