Andhra PradeshEast GodavariNews

జీవీఎంసీ మేయర్ ని కలిసిన పరవాడ మాజీ జెడ్పిటిసి బొ ద్దపు వెంకటరమణ

*జీవీఎంసీ మేయర్ ని కలిసిన పరవాడ మాజీ జెడ్పిటిసి బొ ద్దపు వెంకటరమణ*

కోస్తా ఎన్కౌంటర్/ విశాఖపట్నం: పరవాడ మండల వైస్సార్సీపీ నాయకులు మాజీ జెడ్పిటిసి బి వెంకట రమణ జీవీఎంసీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారిని ,మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం కలిశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ11 వ వార్డ్ వైస్సార్సీపీ అభ్యర్థిగా నిలబడి కార్పొరేషన్ విజేతగా గెలిచారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై. యెస్ జగన్మోహనరెడ్డి ప్రోత్సాహం తో పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో వుంటూ పలు సేవలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తించి మేయర్ గా గోళగాని హరి వెంకట కుమారి గారిని నియమించడం చాలా సంతోషకరం అని ఆయన అలాగే పరవాడ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వాటర్ కూడా అభివృద్ధి చేయాలని ఆయన విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ వైస్సార్సీపీ నాయకులు , పరవాడ మాజి జెడ్పిటిసి బొద్దపు వెంకటరమణ -రమణమ్మ లు,బోండా రమేష్ కుమార్ తదితర బృందం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా వేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఆవిడ హర్షం వ్యక్తం చేసిన అనంతరం ఈ ప్రాంత ప్రజలకు పలు సమస్యలు ఉన్నాయని మేయర్ దృష్టికి తీసుకురాగా మేయర్ సానుకూలంగా స్పందించారు అని అన్ని సమస్యలు పూర్తిగా పరిశీలించి అందులో లోటుపాట్లు ఉంటే సరిచేసి ఆయా శాఖ పరమైన అధికారులతో చర్చించి అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Comment here