Andhra PradeshEast GodavariNews

జ్వరాల పై సర్వే..

జ్వరాల పై సర్వే..

* మల్లవరం గ్రామాన్ని పరిశీలించిన రాజమండ్రి అదనపు వైద్య అధికారిణి కోమలి

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  గ్రామాల్లో జ్వరాలకు సంబంధించి సర్వే జరుగుతుందని, అందరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజమండ్రి జిల్లా అదనపు వైద్యాధికారిణి కోమలి అన్నారు. శుక్రవారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సీజనల్ జ్వరాలు మరియు ఫ్రైడే ,డ్రై డే సందర్భంగా గృహ పరిశీలన, ఫీవర్ సర్వేలెన్సు  కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మల్లవరం గ్రామములో గోకవరంనుండి వచ్చిన ప్రత్యేక టీం మరియు మల్లవరం ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సచివాలయ సిబ్బంది అంతా చేపట్టారు. ఈ సందర్భంగా వూరంతా ఇంటింటికీ తిరిగి  జ్వరాల పట్ల డెంగ్యూ ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిశుభ్రత గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఊరి మొత్తంలో 3 జ్వరకేసులు నమోదు కాగా రక్త పరీక్షలు చేసి చికిత్స చేయడమైనది.అనంతరం డిప్యూటీ డి.ఎమ్.అండ్ హెచ్.ఓ కోమలి, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సి.హెచ్.శ్రీనివాసరాజు కొత్తపల్లి వైద్యులు రవిచంద్ర చే ఏర్పాటు చేయబడిన మెడికల్ కాంప్ ను సందర్శించారు.జ్వర కేసులను వారి ఇంటికెళ్లి పరీక్షించి అవి డెంగీ జ్వరాలు కాదని వాటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను
గూర్చి తెలిపారు.వైద్య సిబ్బంది, పంచాయతి సచివాలయ సిబ్బందికి
ఆరో గ్యం పారిశుధ్యం గురించి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమములో గ్రామసర్పంచ్  లక్మి, ఈ.అర్జునరావు, సెక్రటరీ ఎ.గోవిందు సి.హెచ్.
ఓ.మేరికృప,ఎమ్.పి.హెచ్.ఈ. ఓ.రాయుడు, హెచ్.ఎస్ లు అశోకవర్ధన్ ,అరుణోనమ్మ,పి
హెచ్.ఎన్. భారతి,ఏ.ఏన్.ఎమ్ లు సంకురమ్మ,శేషమ్మ, లక్మి,రాజేశ్వరి,హెల్త్ అసిస్టెంట్లు మస్థాన్ భాషా, పవన్,రమణ,అప్పారావు,శ్రీను,నవీన్,నాగేశ్వరరావు, ఆశాలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comment here