Andhra PradeshEast GodavariNews

తల్లి కోసం తపన..

తల్లి కోసం తపన..

* ఏ కూతురికి రాకూడని కష్టం
* జీవ శవంలా పడి ఉన్న తల్లి
* బ్రతుకు భారంగా ఉందంటున్న రేణుక
* నా తల్లిని కాపాడండి అంటూ కన్నీరు కారుస్తోంది
* పూట గడవడం కష్టంగా ఉందని చెప్పారు

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మండలం లోని రామన్న దొర వీధిలో. నివసిస్తున్న మస బత్తుల పాప వయసు 46 సంవత్సరాలు ఆమెకు ఇద్దరు కుమార్తెలు, చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో తల్లి పాప,  వారిద్దరి ఆలాన పాలనా చూసుకుంటూ.. జీవితాన్ని ఎంతో చక్కగా గడిపేవారు. పెద్దమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. చిన్నమ్మాయి రేణుక ఒక కిరాణా షాపులో పని చేస్తూ ఉండేది. రేణుకు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు అమ్మమ్మ రాజా కాన్వెంట్ లో ఆయాగ పనిచేసేది. తాతయ్య కూలి పనికి వెళుతూ ఉండేవాడు. ఇకపోతే రేణుక అమ్మ నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఉండేది. గత ఏడాది డిసెంబర్లో మస బత్తుల పాప, కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో. రాజమండ్రి గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరవాలేదని మందులు ఇచ్చి పంపించేశారు, ఒక వారం రోజుల తర్వాత పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో.. రాజమండ్రి లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపిస్తే.. వాళ్లు రక్త పరీక్షల రిపోర్టులు తీసుకురమ్మన్నారు, అదే ఊర్లో జాగృతి లో రక్తపరీక్షలు చేయిస్తే తమ రిపోర్టర్ ని పైకి పంపించాలని 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దాంతో ఆమె కిడ్నీ వ్యాధి సమస్య ఉందని నిర్ధారణ చేశారు. మందులు వాడితే నయమవుతుందని వైద్యులు చెప్పడంతో. మందులు వాడుతూ వచ్చారు. ప్రతి నెల మందులకు 10 వేల రూపాయలు అయ్యేది. అయినా వ్యాధి నయం కాకపోవడంతో.. పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడింది పాప. తన తల్లిని చూసుకుంటూ చిన్న కూతురు రేణుక కిరాణా షాప్ లో పని మానేసింది. అమ్మమ్మ కూడా కాన్వెంట్ లో ఆయాగ మానేసింది. వీరికి రోజు గడవడం కష్టంగా మారింది. దాంతో వీరికి ఉన్న  ఇల్లు అమ్మేశారు. మరిన్ని ఇబ్బందులకు గురయ్యారు. వీరి కుటుంబం గడవాలంటే తాతయ్య పనికి వెళ్లి కూలీ డబ్బులు తీసుకువస్తేనే పూట గడుస్తుంది. వీరికి సచివాలయం 1 వాలంటీర్లు పి దుర్గ, కె దేవి, వి సురేఖ, 25 కేజీల బియ్యం నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వారికి ఇచ్చారు, ప్రభుత్వం నుంచి సాయం అందించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comment here