Andhra PradeshEast GodavariNews

తిరుమల యాత్రికులకు ఆహార పదార్థాలు అందజేత.

తిరుమల యాత్రికులకు ఆహార పదార్థాలు అందజేత.
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో  నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వెళ్లి, వచ్చే భక్తులకు గండేపల్లి మండలం మురారి గ్రామంలో విద్వవరేణ్య ఆశ్రమం వద్ద మూడు రోజులుగా సుమారు 5,000 మంది భక్తులకు ఉదయం స్వల్ప ఆహారం, మధ్యాహ్నం,రాత్రి  భోజన పదార్థాలను ఉచితంగా అందించారు.జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి సమకూర్చిన దినుసులతో ఆశ్రమ భక్తులు, ఆహార పదార్థాలు తయారు చేసి,  తిరుమల నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణించే భక్తులకు ఈ ఉచిత అన్న ప్రసాదం (పులిహోర, పెరుగన్నం, మంచినీరు బాటిల్)  అందించారు. భక్తులు ఆహార పదార్థాలు స్వీకరించి, దాత రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Comment here