Andhra PradeshEast GodavariNews

తెలుగుదేశం పార్టీ మండల కమిటీల నియామకం

గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీలను నియామకం
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి :  జగ్గంపేట మండలం ఇర్రిపాక లో జ్యోతుల నెహ్రూ స్వగృహంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం మండల కమిటీలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ మండల కమిటీ మండల అనుబంధ కమిటీలు మరియు గ్రామ కమిటీలు నియమించడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజులుగా మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.కిర్లంపూడి జగ్గంపేట మండల కమిటీలు వేసుకోవడం జరిగిందని ఈరోజు గండేపల్లి మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.గండేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా పోతుల మోహన్ రావు, మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, ప్రగడ రెడ్డి వీరబాబు, తెలుగు రైతు అధ్యక్షులుగా అడబాల భాస్కరరావు, మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా యర్రం శెట్టి వెంకట లక్ష్మి, ఎస్సి సెల్ అధ్యక్షులు గా పెదపాటి శూబాకర్, బీసీ సెల్ అధ్యక్షులు గా తంగెళ్ల అప్పారావు వ్యాపార విభాగం అధ్యక్షుడిగా బొల్లం రెడ్డి రామకృష్ణ,, కార్మిక శాఖ అధ్యక్షుడిగా చీకట్ల నాగరాజు, తెలుగునాడు స్టూడెంట్ అధ్యక్షుడిగా గారపాటి సునీల్ చౌదరి, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్ వి ఎస్ అప్పలరాజు, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షులు కోర్పు లచ్చయ్య దొర, తెలుగు యువత రాష్ట్ర నాయకులు కోర్పు సాయి తేజ, పోతుల మోహన రావు, కాకినాడ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ ఉండవల్లి వీర్రాజు, అడబాల భాస్కర రావు, పాలచర్ల సత్యనారాయణ, ఎర్రంశెట్టి బాబ్జి, పాలచర్ల ఆదినారాయణ, మురారి అబ్బన్న, పైణ్డి వెంకటేశ్వరరావు, శిలమంతుల వీరబాబు, గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment here