Andhra PradeshEast GodavariNews

దసరా ఉత్సవాల అన్నసంతర్పణ కార్యక్రమాలో రుడా చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి గారు

శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయ కమిటీ దసరా ఉత్సవాల అన్నసంతర్పణ కార్యక్రమాలో రుడా చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి గారు
స్థానిక రాజమండ్రి జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ లో శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయం కమిటీ వారి ఆహ్వానం మేరకు  అన్నసంతర్పణ కార్యక్రమంలో రుడా చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి గారు పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించారు మరియు రుడా చైర్మన్ షర్మిళ రెడ్డి గారు మాట్లాడుతూ… శివాలయం పక్కన ఉన్న అమ్మవారి ఆలయం వారు గత 16 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు అన్నసంతర్పణ కార్యక్రమాలు చేస్తున్న ఆలయ కమిటీ వారందరికీ ఆ అమ్మవారి  కటాక్షం ఎల్లవేళలా ఉండాలని భక్తులు అందరూ సంతోషంగా ఉండాలని  కోరారు… ఈ కార్యక్రమంలో గుడి ప్రెసిడెంట్ ఎర్ర శంకర్ రావు గారు, 5.వ వార్డ్ ఇంచార్జ్ ఎర్ర ప్రసాద్ గారు, బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ గారు, పూర్ణిమ ప్రసాద్ గారు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Comment here