Andhra PradeshEast GodavariNews

దిశ చట్టం ప్రకారం ఎన్ని కేసుల్లో శిక్షలు విధించారు

మహిళలపై అత్యాచార ఘటనల్లో సత్వర న్యాయం ఎందుకు చేయడం లేదు?
దిశ చట్టం ప్రకారం ఎన్ని కేసుల్లో శిక్షలు విధించారు.
*ప్రభుత్వం పై మండిపడ్డ అత్యాచార నిరోధక పోరాట వేదిక మహిళా నాయకులు రమాదేవి,దుర్గాభవాని, సుంకర పద్మశ్రీ*
రాజమండ్రి:సెప్టెంబర్ 11: రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళపై అత్యాచారాలు,హత్యలు పెరిగిపోతున్నాయని,అత్యాచార బాధిత కుటుంబాలను కదిలిస్తే కనీళ్లు ధారలవుతున్నాయని ఎపి మహిళ సంఘాల ఐక్య పోరాట వేదిక నాయకులు డి.రమాదేవి, దుర్గాభవాని,సుంకర పద్మశ్రీ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం రాజమండ్రి లో ఏడాది క్రితం అత్యాచారానికి గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నాయకులు మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటి వద్ద బాధితులతో మాట్లాడారు.అనంతరం పత్రికా సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రమాదేవి మాట్లాడుతూ శనివారం సాయంత్రం మాజీ ఎంపీ హర్షకుమార్ స్వగృహంలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పనికి  తీసుకు వెళ్లిన బాలికను అత్యాచారం చేసిన బాధిత యువతికి ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదని, కొద్దిపాటి నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేయి దులుపుకుందని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచార కేసులు చాలా పెండింగులో ఉన్నాయని కరోన కుంటి సాకు చెప్పి కేసుల పరిష్కారాన్ని జాప్యం చేస్తున్నారని విమర్శించారు.బాధితులు తలెత్తుకునేలా, సమాజంలో జీవించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళకు న్యాయం జరగలేదని విమర్శించారు. నిర్భయ చట్టం నాలుగు నెలల్లో కేసును పూర్తిచేయాలని, చట్టం చెబుతున్న హత్యాచారం మహిళల కేసులు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు.బొమ్మూరు లో బాలికకు మధురపూడి లో బాలికకు ఇప్పుడు వరకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతుంటే దిశ చట్టం ఎంత మందికి న్యాయం చేసిందని ప్రశ్నించారు.
అత్యాచారం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం  చేయాలని, నష్ట పరిహారం ఇవ్వాలని అని వారికి పునరావాసం కల్పించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని చట్టప్రకారం కోర్టులు పనిచేసేలా నేరస్తులకు శిక్షపడేలా, నేరాలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళ ఐక్యవేదిక సమక్షంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకో పోతే ప్రభుత్వానికి భరతవాక్యం పలుకుతామని రమాదేవి హెచ్చరించారు.
మహిళ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతుకు నొక్కుతూ వివక్ష చూపిస్తున్నారని, దళితుల పట్ల దాడులు, మహిళల పట్ల అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనబడటం లేదా అని ప్రశ్నించారు ప్రజా సమస్యలను పక్కనపెట్టి బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏ ఒక్కరికి సరైన న్యాయం జరగలేదని అన్నారు. సత్వరమే బాధితులకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహిళా కాంగ్రెస్ నాయకురాలు పద్మశ్రీ,మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఇన్ని జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. . రాజధానిలో జరిగితే మాత్రం అక్కడ పట్టించుకుంటున్నారు అని అన్నారు. డీజీపీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ, పోలీసులు బాధితుల పట్ల అవహేళనగా మాట్లాడుతున్నారన్నరని, పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని అన్నారు.హోమ్ మినిస్టర్, మహిళా చైర్ పర్సన్ ప్రభుత్వాలు, బాధితుల కుటుంబ జీవన విధానం మెరుగు పడేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లో సమాజ సేవకురాలు కొల్లు వెలిసి హారిక, ఐద్వా జిల్లా కార్యదర్శి టీ తులసి, ఐద్వా నాయకురాలు సావిత్రి, యుటిఎఫ్ మహిళ విభాగం నాయకులు సరోజిని,రాజేశ్వరి,సత్య, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి నల్ల భ్రమరాంబ, నాయకురాళ్లు ఎడ్ల లక్ష్మి, రమణమ్మ, ఎస్ ఎఫ్ ఐ ,డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్సులు ఎన్ రాజా,బి.రాజులోవ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comment here