Andhra PradeshEast GodavariNews

దిశ యాప్ యువతులకు రక్షణ కవచం

దిశ యాప్ యువతులకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది:రూరల్ సీఐ శివ గణేష్

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:ఆపదలో ఉన్న మహిళలు,యువతులకు దిశ యాప్ రక్షణ కవచంలా ఉపయోగ పడుతుందని మండపేట రూరల్ సీఐ శివ గణేష్ పేర్కొన్నారు.సోమవారం అంగర శ్రీ సిద్ధార్థ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఆయన కళాశాల విద్యార్థులకు దిశ యాప్ సద్వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రములో మహిళల సురక్ష,రక్షణ, భద్రత కొరకు ప్రభుత్వం దిశ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దిశ ఎస్ ఓ ఎస్ బటన్ ఫ్రెష్ చేస్తే నిమిషాల వ్యవధిలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆదుకుంటారన్నారు.ఒంటరిగా ఆటోలు క్యాబ్ లలో  ప్రయాణం చేయరాదని,అలా పయనించే యువతులు ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ వినియోగించుకుంటే వారి వెళ్లే మార్గం ట్రాక్ చేయడం జరుగుతుందన్నారు.స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థినులు, యువతులు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.ఈ దిశ యాప్ ఆపద సమయంలో నిండు జీవితాన్ని కాపాడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.వెంకటరమణ, సచివాలయ మహిళా పోలీసులు దుర్గ భవాని,అమ్మాజీ, కళాశాల సిబ్బంది,విద్యార్థినులు పాల్గొన్నారు.

Comment here