Andhra PradeshEast GodavariNews

*దుర్గా స్వరూపంలో బాలా త్రిపుర సుందరి దేవి*

*దుర్గా స్వరూపంలో బాలా త్రిపుర సుందరి దేవి*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని సోమేశ్వరం గ్రామంలో చంద్ర ప్రతిష్టితమై పురాణ ప్రాశస్త్యంగల బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం అమ్మవారు దుర్గా రూపంలో అలంకరింపబడి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని దుర్గాష్టమి పురస్కరించుకొని దుర్గామాత గా అలంకరించి అర్చనలు ,అష్టోత్తర సహస్ర నామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. సోమేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. వివిధ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు దివ్యాలంకణ చేశారు. మూల పూజలు ప్రారంభం కావడంతో భక్తులు విశేషముగా ఆలయానికి తరలి వచ్చి సామూహిక కుంకుమ పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పెమ్మాడ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Comment here