Andhra PradeshEast GodavariNews

దేవాలయాల దొంగతనాల కేసు చేధించిన పోలీసులు

దేవాలయాల దొంగతనాల కేసు చేధించిన పోలీసులు
-ఐదు రోజుల్లోనే దొంగలను పట్టుకున్న వైనం
-తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకుల శ్రీనివాస్
కోస్తాఎన్ కౌంటర్, గండేపల్లి : దేవాలయాలలో వరుస దొంగతనాలు చేసి జిల్లాలో కలకలం రేపిన కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించి దొంగలను అదుపులోనికి తీసుకున్నారు. ఆగస్టు 25 వ తేదీ రాత్రి తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి, రామయ్యపాలెం, సింగరంపాలెం, కె.గోపాలపురం,  నీలాద్రిరావు పేట గ్రామాల్లో ఎనిమిది ఆలయాలలో దొంగతనాలకు పాల్పడిన బాలురు ముగ్గురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసు విషయమై పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాస్ గండేపల్లి పోలీస్ స్టేషన్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు అత్యంత ప్రాధాన్యత గా తీసుకుని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సిసిఎస్ డిఎస్పి ఎస్ రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దేవాలయాల దొంగలను పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన కాకినాడ సిసిఎస్ టు సిఐ ప్రశాంత్ కుమార్, జగ్గంపేట సీఐ సురేష్ బాబు, గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్, కిర్లంపూడి ఎస్సై జి అప్పలరాజు, గండేపల్లి హెచ్ సి లు మూర్తి, వెంకటరమణ, హోంగార్డులు నాగేశ్వరరావు, కుమార్ లను ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు అన్నారు.ఈ ముగ్గురు బాలురు వారు నేరాలు చేయడానికి ఉపయోగించిన హీరో హోండా మోటర్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ముగ్గురు బాలురు భీమవరం కు చెందిన గిరీష్ కుమార్ తో కలిసి చెడు వ్యసనాలకు అలవాటు పడి వ్యసనాలు తీర్చుకోవడానికి గుడి దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలకు అలవాటుపడ్డారన్నారు. వీరిపై పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో అనేకమైన కేసులు నమోదైనవని, గండేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదయిన కేసులు తోపాటు భీమవరం లో రెండు దొంగతనాలు, రావులపాలెం లో జరిగిన ఒక దొంగతనం మొత్తం 11 నేరాలు ఒప్పుదల జరిగిందన్నారు.
 తల్లిదండ్రులు పిల్లల పట్ల తస్మాత్ జాగ్రత్త : పెద్దాపురం డిఎస్పి అరిటాకుల శ్రీనివాస్
తల్లిదండ్రులు పిల్లల పట్ల అజాగ్రత్త వహించవద్దని పెద్దాపురం డిఎస్పి అరిటాకుల  శ్రీనివాస్ హెచ్చరించారు. తల్లిదండ్రులు వారి వ్యక్తిగత అవసరాలలో పడి పిల్లలను సక్రమంగా పట్టించుకోకపోతే వారు చెడు సావాసం చేసి దుర్వ్యసనాలకు అలవాటు పడి వాటిని తీర్చుకునేందుకు నేరస్తులుగా మారే ప్రమాదం ఉందని కాబట్టి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని డీఎస్పీ సూచించారు.

Comment here