Andhra PradeshEast GodavariNews

దోమల నివారణ చర్యలు

దోమల నివారణ చర్యలు

* లార్వా దశలోనే దోమ సంతతి అంతం
* గోకవరం పంచాయతీలో దోమల నివారణకు ప్రత్యేక ఏర్పాటు

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  దోమలు నివారణకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు…ఫాగింగ్, స్ప్రేయింగ్ లతో పాటు ఇప్పుడు ఆయిల్ బాల్స్ ని ఉపయోగిస్తున్నారు.. ఆయిల్ బాల్స్ వాడటం వల్ల లార్వా దశలోనే దోమ సంతతి అంతం అయిపోతుంది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పంచాయితీ సెక్రటరీ టంకాల శ్రీనివాస్ వెల్లడించారు..గోకవరం పంచాయతీలో నిల్వ నీరు ఉన్న చోట ఆయిల్ బాల్స్ ని వాడుతున్నారు..వాహనాల్లో వాడే ఆయిల్ తో పాటు రంపపు పొడి  కలిపి ఒక రకమైన రసాయనాన్ని తయారు చేస్తారు. దీన్ని ఒక గుడ్డలో గట్టిగా కట్టి కొన్ని గంటలు ఉంచుతారు.. ఇది బాల్ మాదిరిగా తయారవుతుంది. ఎక్కడైతే నీటి నిల్వ ఉన్న ప్రదేశాలు ఉన్నాయో అక్కడ వీటిని తీసుకెళ్లి కలుపుతారు. ఆ ద్రావణం నీటి పై తెట్టు మాదిరిగా ఏర్పడి, లోపలికి గాలి వెళ్ళనివ్వదు. దోమలు నిల్వ నీటిలో వాలాలన్న కుదరదు. తెట్టు మాదిరిగా ఉన్న ద్రావణం దోమల లార్వా సంతతిని కొన్ని గంటల్లోనే నాశనం చేస్తుంది. ఒక్కసారి నిల్వ నీటిలో ఇది కలిపితే కొన్ని రోజుల పాటు ఉంటుంది. వర్షాలు పడే సమయంలో ఇది పనిచేయదు. కేవలం నిల్వ ఉన్న నీటిలో మాత్రమే వేయాలి. ఇప్పుడు పంచాయతీలో నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి అందులో వేస్తున్నారు. ఇది వేసిన వెంటనే పొగ మాదిరిగా వస్తుందని సెక్రటరీ శ్రీనివాస్ చెప్పారు. ఈ వారం అంత దోమల నివారణ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోకవరం పంచాయితీ కార్యాలయంలో ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉన్నాయి.

Comment here