Andhra PradeshEast GodavariNews

నన్నయ అభివృద్ధికి దాతల సహకారం అవసరం

నన్నయ అభివృద్ధికి దాతల సహకారం అవసరం

 వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి దాతల సహకారం అవసరమని, సహృదయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. యూనివర్సిటీ ఈసీ హాల్ లో శుక్రవారం వీసీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లోని విద్యాలయాలను దేవాలయాలుగా భావించి వాటి అభివృద్ధికి పాటుపడే మహనీయులు ఉన్నారని వారి సహాయ సహకారాలతో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేద్దామని అన్నారు. గోదావరి జిల్లాల్లోని ఉన్నత విద్యను అందరికీ అందించాలనే గొప్ప లక్ష్యంతో ఏర్పాడిన ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయమని దీనిని అభివృద్ధి చేసుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసేందుకు దాతలు సహృదయంతో ముందుకు రావాలని వీసీ కోరారు. దాతలు, ఫిలాంత్రోఫిక్ సొసైటిలు, ట్రస్ట్ లు, ఓ.ఎన్.జి.సి, పేపర్ మిల్, అవంతి, హార్లిక్స ఫ్యాక్టరీ, కోకోకోలా వంటి సంస్థలు మరియు అనుబంధ కళాశాలలు అందరూ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. దాతల సహకారంతో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసేందుకు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కమిటీ విశ్వవిద్యాలయానికి అవసరమైన వనరులు, వసతులు, భవనాలను సమకూర్చే విధంగా దాతలకు మార్గనిర్ధేశం చేస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధి పాటుపడాలని తెలిపారు. దాతల సహాయ సహకారాలను అందుకుంటూ వారిని విశ్వవిద్యాలయం తరుపున గౌరవించుకుంటూ సమష్టిగా కృషి చేస్తూ ప్రగతి పథంలో పయనిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.టేకి, డీన్ ఆచార్య పి.సురేష్ వర్మ, డా.తలారివాసు, డా.బాలకృష్ణ, లీగల్ ఆఫీసర్ నందపు నాగేంద్రరావు, పి.ఆర్.వో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Comment here