Andhra PradeshEast GodavariNews

నయనానందకరం సామూహిక సీమంతోత్సవం

నయనానందకరం సామూహిక సీమంతోత్సవం

కోస్తాఎన్ కౌంటర్, రామచంద్రపురం :  కె.గంగవరం మండలం, సత్యవాడ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు వేంచేసియున్న శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం  వేదపండితుల ఆశీస్సులతో సామూహిక సీమంతోత్సవం నయనానందకరంగా జరిగింది. అత్యంత  ఘనంగా నిర్వహించిన  ఈ దివ్య  శ్రీమంతోత్సవానికి భక్తులు విశేషంగా హాజరై  నిండు అతివలను  మెండుగా ఆశీర్వదించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సత్యవాడ,  పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Comment here