Andhra PradeshEast GodavariNews

నాటుసారా కేంద్రాలపై దాడులు

నాటుసారా కేంద్రాలపై దాడులు

పెద్ద మొత్తంలో యార్క్ ద్వంసం..
యువతలో అవగాహన కల్పిస్తున్న రూరల్ సిఐ కె.కిషోర్ బాబు
కోస్తా ఎన్కౌంటర్-తుని
జిల్లా వ్యాప్తంగా ఉన్నత అధికారులు ఆదేశాలుతో ఎస్బి పోలీసులు,స్థానిక పోలీసులు,యువత సహకారంతో  మండలంలో వివిధ గ్రామాల్లో తెల్లవారుజామునే నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున బెల్లపూఊటాను ద్వంసం జేసి నాటుసారాను స్వాధీనం జేసికున్నారు. కోటనందురు మండలంలో నిర్వహించిన కార్డాన్ సర్చ్ ఈఆపరేషన్లో భాగంగా అదేగ్రామంలో నివాస ప్రాంతాల్లో తనిఖీలు నిర్వగించగా సుమారు 930 లీటర్ల నాటుసారా సమీపంలో వాగు పరిసరాల్లో  సుమారు 8500 లీటర్ల బెల్లపుఊటను స్వాధీనం చేసుకొని ద్వంసం జేసి ముగ్గురు వ్యక్తులును అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లుగా రూరల్ సీఐ కె.కిషోర్ బాబు తెలిపారు. దీనిపై కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడులను పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు సూచనలతో స్థానిక ఎస్ఐ ఎం.అశోక్, సిబ్బంది,జిల్లా స్పెషల్ పోలీసులు పాల్గొన్నారని తెలిపారు.
యువత అశాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి::: సిఐ కిషోర్ బాబు
గ్రామాల్లో యవత అశాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ,ఉపాధి అవకాశాలుపై దృష్టి సారించి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామంలో వివిధ రూపాల్లో కోరలు చేస్తున్న  సాంఘీక దూరచారాలైన మద్యం అమ్మకాలు, నాటుసారా తయారీ,గంజాయి,పేకాట,గుండాట వంటి అశాంఘిక అలవాట్లుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమాజం కోసం ఎంతోకొంత సమయాన్ని కేటాయించి సమాజ శ్రేయస్సుకు కృషి చెయ్యాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులుకు సహకారాన్ని అందివ్వాలని కోరారు.

Comment here