Andhra PradeshEast GodavariNews

*నాటుసారా విక్రయిస్తున్న ఇరువురు మహిళలు అరెస్ట్*

*నాటుసారా విక్రయిస్తున్న ఇరువురు మహిళలు అరెస్ట్*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం*:*నాటుసారా విక్రయిస్తున్న ఇరువురి మహిళలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్. సురేష్ తెలిపారు.ఆదివారం ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశాలపై రామచంద్రపురం డి ఎస్ పి ఎం. బాలచంద్రారెడ్డి, అనపర్తి సి ఎన్. వి భాస్కర్ రావు పర్యవేక్షణలో మండలంలో దాడులు నిర్వహించామన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో సారా విక్రయిస్తున్న పెంకే నాగమణి ని అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే మాచవరం గ్రామంలో వెలగల భూలక్ష్మిని అదుపులోకి తీసుకొని మూడు లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని వారిరువురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు

Comment here