Andhra PradeshEast GodavariNews

నిట్‌లో ప్రారంభమైన శిక్షణ తరగతులు

నిట్‌లో ప్రారంభమైన శిక్షణ తరగతులు
ఫొటో : 08టిపిజి07 : తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌ నుంచి జరిగిన ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డైరెక్టర్‌ సీఎస్పీ.రావు…….
కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : పట్టణంలోని జాతీయ సాంకేతిక విద్యాలయం (ఆంధ్రప్రదేశ్‌)లో స్కోప్‌ ఫర్‌ టెక్నోప్రెన్యూర్స్‌ ఇన్‌ అకాడమిక్‌ ఇనిస్టిట్యూషన్స్‌ అనే అంశంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ.రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆలోచనలను వ్యవస్థాపక మార్గంలో పెంపొందించడం, ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అభివృద్ధి చేయడం, మెంటర్స్‌ నుంచి సలహాలు కోరడం, తప్పులు నుంచి నేర్చుకోవడం వంటివి వాటి గురించి వివరించారు. విద్యార్థుల్లోని ఆవిష్కరణ నైపుణ్యాన్ని పెంపొందించడం, విద్యాసంస్థలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, వ్యవస్థాపకులకు కావలసిన సామర్థ్యాల అభివృద్ధి, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్ట్‌ అప్‌ స్కీమ్‌లపై అవగాహన, విద్యార్థులు విజయవంతంగా స్టార్ట్‌ అప్‌ కంపెనీలు ప్రారంభించడానికి ప్రణాళిక వంటి ఐదు అంశలపై శిక్షణ జరుగుతుందన్నారు. బయో టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావుతో పలువురు వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ సంస్థలకు చెందిన సీఈవోలు, జనరల్‌ మేనేజర్లులు మాట్లాడారు. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ ఇంక్యుబేషన్‌ అండ్‌ కన్సల్టెన్సీ, బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అధ్యాపకులు, విద్యార్థులు ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comment here