Andhra PradeshEast GodavariNews

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే
పెంటపాడు మండలం పరిమెళ్ళ గ్రామంలో రహదారికి మరమ్మతులు చేస్తున్న జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌……

కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : రహదారుల దుస్థితిపై నియోజకవర్గ ప్రజాప్రతినిధి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండలంలోని పరిమెళ్ళ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, రోడ్లపై ఏర్పడిన గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం తగదన్నారు. ఆయన చేతకాని తనం వల్లే రహదారులు చెరువులను తలపిస్తున్నాయన్నారు. దీంతో జనసేన ఆధ్వర్యంలో రహదారులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధి స్పందించి బాధ్యతగా వ్యవహరించి రోడ్లను బాగు చేయాలని బొలిశెట్టి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Comment here