Andhra PradeshEast GodavariNews

నివాస యోగ్యం కాని చోట స్థలాల

నివాస యోగ్యం కాని చోట స్థలాల
…పేద ప్రజలను మోసం చేయడానికే  రెండు పార్టీలా
… బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: దేశ ప్రధాని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలి ఉద్దేశంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తుంటే, తెలుగు దేశం పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను మోసం చేస్తున్నారని కాకినాడ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నాడు కాకినాడ రూరల్ మండలంలోని వలసపకల గ్రామం లో బీజేపీ కార్యాలయం వద్ద కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ  పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలి ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశంలోనే లక్ష 50 వేల ఇళ్ల నిర్మాణానికి కేటాయించగా, రాష్ట్రానికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తే క్రీట్ కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం ప్రజలకు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులంతా సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. బిజెపి శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ పెద్దిరెడ్డి రవి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రానికి 20 లక్షలకు పైగా గృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పై వారు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. నివాసయోగ్య కాని ప్రదేశాలను ఇళ్ల స్థలాలుగా రాష్ట్ర ప్రభుత్వం రూ 40 50 లక్షలతో కొనుగోలు చేసి ఎమ్మెల్యేలు మంత్రులు దానిపై సంపాదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల పేరుతో దోపిడీ చేసిందన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలకు ఎటువంటి సహకారం అందించకుండా నిర్మించిన ఇల్లు ఇప్పటివరకు పేదలకు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఎలా అయితే కాలయాపన చేసిందో అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పేద ప్రజలకు నిర్మించిన ఇళ్లను ఇవ్వనందుకు ఎన్నో సాకులు వెతుకుతున్నట్లు ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రతి అర్హులకు ఇళ్లను అప్పగించటం జరుగుతుందని మాట ఇచ్చి నేడు మడమ తిప్పి మాట తప్పిన నాయకుడు జగన్మోహన్రెడ్డి  అన్నారు. ముందుగా పేద ప్రజలందరికీ నిర్మించిన ఇళ్లను అందిన తర్వాతే నివాసానికి బాగా ఉండే విధంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కాకినాడ రూరల్ బిజెపి మండల అధ్యక్షులు కాళ్ల ధనరాజు, డి వీకే రాజు, చోడిశెట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Comment here