Andhra PradeshEast GodavariNews

నేత్ర దానం పై అవగాహణ అవసరం

సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
*జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల సందర్భంగా*
కోస్తాఎన్ కౌంటర్, డోన్ పట్టణం :-  నేత్రదానంపైన, అంధత్వం పై అవగాహణ  నిర్వహించటం , ప్రజలకు పూర్తిస్థాయిలో నేత్రదానంపై అవగాహన కల్పించడంతోపాటు కంటి సమస్యలు రాకుండా చైతన్య పరచడమే లక్ష్యంగా కృషి చెయ్యాలన్నదే  ముఖ్య ఉద్దేశం.మరణానంతరం కళ్ళను దానం చేస్తే  ఆ కళ్ళను చూపు లేని వారికి అమరుస్తె కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు .ఇప్పటికి ఆశించినంత  స్థాయి లో  చైతన్యం లేని కారణంగా నేత్రదానానికి ముందుకు రావడం లేదు. కావున ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి  ప్రజా సంఘాలు ,స్వచ్చంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ,సామాజికంగా  ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని  సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పిలుపునిచ్చారు.
మానవుని కళ్లు మరో జన్మ విషయంలో అదృష్టం చేసుకున్నాయనే చెప్పొచ్చు. మనిషి శరీరం మట్టిలో కలిసిపోయినా వేరొకరికి నేత్రదానం చేయడం ద్వారా మరో గొప్ప అనుభూతిని పొందవచ్చు. మన చుట్టూ సమాజంలో ఎంతో మంది అభాగ్యులు చూపునకు దూరమై మానసిక వేదనకు గురవుతున్నారు. చూపు లేకపోతే చిమ్మ చీకట్లు అలుముకున్నట్లే. కానీ నేత్రదానం చేయటం ద్వారా వారిలో ఈ లోటును భర్తీ చేస్తుందనడంలో సందేహం లేదు. అంధత్వంతో బాధపడే వారికి, అర్థాంతరంగా చూపుకోల్పోయిన అభాగ్యులకు చూపునిచ్చేందుకు, ప్రతి ఒక్కరు కృషి చేయ్యల్సిన ఆవశ్యకత ఎంతైన ఉన్నది.
భారతదేశంలో, అనేక  మంది ప్రజలు శుక్లాల వల్ల అంధత్వంతో బాధపడుతున్నారని ,వీరికి శుక్ల మార్పిడి ద్వారా ఉపశమనం కలిగించవచ్చునని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.
*నేత్ర దానం గురించిన వాస్తవాలు*
కళ్ళు మరణం తరువాత మాత్రమే దానం చెయవచ్చు.మరణం తర్వాత 4-6 గంటల  లోపల కళ్లను దానం చెయ్యాలి .కళ్ళు నమోదిత వైద్యుని ద్వారా మాత్రమే తొలగించాలి.నేత్రనిధి  ఆస్పత్రి సిబ్బంది మరణించిన వారి ఇంటికి కళ్ళు తీసుకోవాడానికి వెళతారని  వైద్యులు తెలియజేస్తూన్నారని  సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలిపారు.
నేత్రదానం చెయ్యాలంటే కొన్ని జాగ్రత్తలు:-
మరణించినవారి కంటి రెప్పలను మూసివేయండి. మరణించిన వ్యక్తి మీద నేరుగా ఏదైనా ఫ్యాను ఉంటే  ఆపేయండి. కింద ఒక దిండును ఉంచి మరణించిన వారి తల పైకి లేపండి.సాధ్యమైనంత త్వరగా సమీప నేత్రనిధిని సంప్రదించాలని వైద్యులు తెలియజేస్తున్నారని  సామాజిక కార్యకర్త డోన్  పి. మహమ్మద్ రఫి తెలిపారు.

Comment here