Andhra PradeshEast GodavariNews

*పంచాయితీ పాలనపై వార్డు సభ్యులు అవగాహన కలిగి ఉండాలి.*

*పంచాయితీ పాలనపై వార్డు సభ్యులు అవగాహన కలిగి ఉండాలి.*
–ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు.

కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి: ఆలమూరు
నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గ్రామ పాలన పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆలమూరు మండల అధ్యక్షుడు (ఎంపీపి) తోరాటి లక్ష్మణరావు అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజా పరిషత్ సమావేశపు హాలులో మొదటి విడతలో తొమ్మిది గ్రామాలకు సంబంధించి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ (APSIRDPR) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరుగుచున్న ఉప సర్పంచ్, వార్డు సభ్యుల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి వార్డు సభ్యుడు ఆయా వార్డుల్లోని సమస్యలను గుర్తించి పంచాయితీ సమావేశంలో వివరించి తీర్మానం చేసే విధంగా కృషి చేయాలని అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలమూరు వ్యవసాయ సలహా కమిటీ అధ్యక్షుడు యనమదల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ప్రభుత్వము చేయని విధంగా వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మంచి పరిపాలన ప్రజలకు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. వార్డు సభ్యులకు, ఉప సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులుగా వచ్చిన బుజ్జిరాజు, ఆలమూరు ఈఓపిఆర్డి రాజ్ కుమార్, మండల పరిపాలన అధికారి టివి సురేందర్ రెడ్డి వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో వార్డు సభ్యులు చేయవలసిన పనులపై పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది గ్రామాలకు చెందిన 98మంది వార్డు సభ్యులు ఉప సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు సర్పంచులు కట్ట శ్రీనివాసు (జొన్నాడ), నేలపూడి లావణ్య (ఆలమూరు) మాజీ ఎం పీ పి తోరాటి రాంబాబు పాల్గొన్నారు.

 

Comment here