Andhra PradeshEast GodavariNews

పంచాయితీ పాలన అంటే…  ప్రజా సేవ 

పంచాయితీ పాలన అంటే…  ప్రజా సేవ
… వార్డు మెంబర్ల కు శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా జడ్పిటిసి  నురుకుర్తి రామకృష్ణ
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: నిజమైన ప్రజా సేవ చేయాలంటే వార్డు నెంబర్లకు సాధ్యమవుతుందని కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం నాడు కాకినాడ రూరల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో వార్డు మెంబర్లుగా గెలు పొందిన వారందరికీ రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు చేరువ అవ్వాలంటే ఆ గ్రామ వార్డు మెంబర్లు వలనే జరుగుతున్నదని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్య అయిన త్రాగునీరు ఎలక్ట్రిసిటీ పారిశుద్ధ్య పనులు వారివారి వార్డులను పరిశుభ్రంగా ఉండే విధంగా చేసుకుంటే ప్రజలు మళ్లీ పట్టం కట్టడం ఖాయమన్నారు. గ్రామ సర్పంచ్ కంటే వార్డు మెంబర్లకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. కష్టపడి ప్రజాసేవ చేస్తేనే పదవులు  దక్కుతాయని, దానికి నిదర్శనం జెడ్పీటీసీ గా నన్ను గుర్తించి రాష్ట్ర మంత్రివర్యులు నా వెనుక ప్రోత్సహించడమే నిదర్శనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద వారికి అందించే బాధ్యత గా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వైయస్సార్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని తిరిగి 10 సంవత్సరాల పాటు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాఠం శెట్టి నారాయణ మూర్తి, ఈవోపీఆర్డీ భాస్కర్ రావు,  సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశరావు( చిన్న) , వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Comment here