Andhra PradeshEast GodavariNews

పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం

పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం
తాడేపల్లిగూడెం మండలం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహిస్తున్న దృశ్యం……
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : మండలంలోని పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు కొయ్యలమూడి బ్రహ్మయ్య ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమంజరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకురాలు కొండ్రెడ్డి హైమావతి మాట్లడుతూ మనిషి జీవించే కాలంలో చేసిన సేవలే సమాజంలో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. పేదవర్గాల పట్ల ప్రేమ, విధేయతలు, సేవాభావంతో జీవించిన మంచి మనిషి బ్రహ్మయ్య అని కొనియాడారు.తాను లేవగానే జన్మించిన తల్లిదండ్రులు, అన్న ఎన్టీఆర్‌ చిత్రపటానికి నమస్కరించిన తర్వాతే మిగతా పనులు చేసే వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆమంచి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Comment here