Andhra PradeshEast GodavariNews

పరిసరాల పరిరక్షణకు పౌరుల సహకారం కూడా అవసరం

పరిసరాల పరిరక్షణకు పౌరుల సహకారం కూడా అవసరం..కమీషనర్ ఎమ్.అభిషిక్త్ కిషోర్.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత అత్యంత కీలకం అని నగరపాలక సంస్థ కమీషనర్ ఎమ్.అభిషిక్త్ కిషోర్ అన్నారు. స్థానిక 32, 33, 34 వార్డుల లో ఈరోజు కమిషనర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. పౌరులంతా తడి చెత్త పొడి చెత్త పై స్పష్టమైన అవగాహన కలిగి వాటికి నిర్దేశించిన బిన్ లలో మాత్రమే వేసి,సేకరణ సిబ్బందికి అందించాలన్నారు.
  ఆరుబయట గాని, కాలవలోగానీ చెత్త పేరుకోకుండా చూడాలని సంబంధిత శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు.  అనంతరం కంబాల చెరువు ను పరిశీలించారు..వర్షం నీరు అధికం గా ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో మురుగునీరు కంబాల చెరువు లోకి వెళ్లకుండా..పంపుల ద్వారా తోడించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు.
కమీషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు,ఎమ్.హెచ్ ఓ వినూత్న,శానిటరీ సూపర్ వైజర్ లు పాల్గొన్నారు

Comment here