Andhra PradeshEast GodavariNews

పల్లె పల్లెలలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి నింపాలి

పల్లె పల్లెలలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి నింపాలి –  ఎస్ విష్ణువర్ధనరెడ్డి,  నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షులు
భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు  క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యములో  గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు ప్రారంబించిన  ఆజాది క అమృత్ మహోత్సవ్  75 సంవత్సరాల స్వాతంత్య్ర  ఉత్సవాలు సందర్భముగా ఆజాదికా అమృత్ మహోత్సవ్  అనే కార్యక్రమం లో భాగముగా రేపల్లె బ్లాక్ పిరాట్లంక గ్రామం లో జరిగిన మొక్కలు నాటు కార్యక్రమం మరియు మెగా   ఫిట్ ఇండియా  ఫ్రీడమ్ రన్  నిర్వహించటం జరిగింది.  నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు శ్రీ బి.జె ప్రసన్న గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసిన  నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షులు లైన శ్రీ సోముగుట్ట విష్ణువర్దన్ రెడ్డి గారు  ప్రారంభించారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ  బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి  స్వాతంత్య్రము సాధించటం  కోసం ఎంతో మంది పోరాడారని అలాగే మన తెలుగు గడ్డపై అల్లూరి సీతారామరాజు వంటి పోరాట వీరులు అలాగే చరిత్రలో లిఖించబడని ఎంతో మంది స్వాతంత్య్ర యోధులు  పోరాట గాధలను వెలుగు లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు తెలుసుకోవటానికి ఈ 75 సంవత్సరాల ఆజాది కా  అమృత్ మహోత్సవ్  ఉత్సవాలను  గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు ప్రారంబించారని, ఈ సందర్భముగా  మెగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ పిరాట్లంక గ్రామం లో జరగటం చాల సంతోషాన్నిస్తుంది అని అలాగే  స్వాతంత్య్ర స్ఫూర్తిని పల్లె పల్లెలకు చేర్చాలని ఆయన అన్నారు.  సభా కార్యక్రమంలో రాష్ట్ర సంచాలకులు  ప్రసన్న గారు మాట్లాడుతూ గారు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా గా 744 జిల్లాలలో ఆగస్టు 13 నుండి  అక్టోబర్ 2 వరకు యువతలో ఆరోగ్యపరంగా శారీరకంగా దృఢంగా ఆరోగ్య భారతావని నిర్మాణాల్లో  భాగస్వాములు అవ్వడం కోసం “”ఫిట్నెస్ కా డోస్ రోజుకో అర్ధ గంట”” నినాదంతో   ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి జాతీయ ఉపాధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరు కావడం ఆనందకరం అని తెలిపారు. ముందుగా పూజ్య బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి సి మొక్కలు నాటిన అనంతరం ముఖ్యఅతిథి చేతులమీదుగా జాతీయ జెండాలు ప్లే కార్డులు నినాదాలతో సుమారు ఐదు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లో అతిధులుగా శ్రీ కమతం సాంబశివరావు గారు శ్రీమతి కమతం విజయ్ కుమారి గారు శ్రీమతి ఆర్ విజయ రావు గారు ఉపసంచాలకులు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్,  శ్రీ శేష తల్ప సాయి,   శ్రీ భీమినేని చంద్రశేఖర్ , స్థానిక ఎస్.ఐ శ్రీ నవీన్ కుమార్,  శ్రీ గణేష్,  శ్రీ జగన్నాథ శాస్త్రి, రత్తయ్య,  శ్రీ వేణు, మరియు నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి అధికారి కుమారి దేవి రెడ్డి కిరణ్మయి, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు

Comment here