Andhra PradeshEast GodavariNews

పల్ల వెంకన్న నర్సరీ ని సందర్శించిన సినీ దిగ్గజం అశ్వనీదత్…

పల్ల వెంకన్న నర్సరీ ని సందర్శించిన సినీ దిగ్గజం అశ్వనీదత్…
సినీ నిర్మాణం లో ఎదురు లేని మనిషి,ప్రముఖ ప్రొడ్యూసర్ చలసాని అశ్వనీదత్  మంగళవారం కడియం పల్ల వెంకన్న నర్సరీ ని సందర్శించారు .ఆయనకు ఇండియన్ నర్సరీమేన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, నర్సరీ డైరెక్టర్లు పల్ల సత్యనారాయణ మూర్తి,గణపతి తదితరులు ఘనస్వాగతం పలికారు. పల్ల వెంకన్న నర్సరీ తో సినీ పరిశ్రమ కు ఎంతో అనుబంధం ఉందని అశ్వనీదత్ అన్నారు. వ్యక్తిగతంగా కూడా పల్ల వెంకన్న కుటుంబం తో తనకున్న పరిచయం ఈ నాటిది కాదన్నారు. నర్సరీ రంగంలో విజేతగా నిలిచిన పల్ల వెంకన్న భౌతికంగా దూరమయ్యారనే వార్త తనను భాదించిందన్నారు. వన రాజు వెంకన్న చిత్రపఠం వద్ద అశ్వనీదత్ నివాళులు అర్పించారు. తన సినీ కెరీయర్ మహా నటుడు,తెలుగుజాతి గర్వించదగ్గ శక్తి, స్వర్గీయ ఎన్టీఆర్ హీరో గా నటించిన ఎదురు లేని మనిషి చిత్రం నుండి ప్రారంభమయ్యి వై జయంతీ బ్యానర్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించామని అశ్వనీదత్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Comment here