Andhra PradeshEast GodavariNews

పవన్‌ కల్యాణ్‌ను అపగలిగే శక్తి.. ప్రభుత్వానికి లేదు

పవన్‌ కల్యాణ్‌ను అపగలిగే శక్తి.. ప్రభుత్వానికి లేదు
`రెండేళ్లుగా రోడ్లు ఎందుకు వెయ్యలేదు?
`పవన్‌ పర్యటనకు భయపడుతున్న ప్రభుత్వం
`తూర్పుగోదావరి జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్‌
`నేడు రాజమండ్రిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన
`హుకుంపేట జంక్షన్‌లో సభ
కోస్తా ఎన్‌కౌంటర్‌, రాజమహేంద్రవరం ప్రతినిథిÑ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను అపగలిగే శక్తి..ఈ ప్రభుత్వానికి లేదని’ తూర్పుగోదావరి జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ పేర్కోన్నారు.పవన్‌ పర్యటనకు ప్రభుత్వం భయపడుతోందని..పోలీసులు అడ్డుతగిలినా పవన్‌ పర్యటన ఆగదని దుర్గేష్‌ అన్నారు. శనివారం రాజమండ్రిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన ఖరారు అయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై దుర్గేష్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌ వస్తున్నాడంటే జగన్‌ ప్రభుత్వం గజగజలాడిపోతుందని..శ్రమదానం చేస్తామంటేనే భయపడి రోడ్లు వేస్తోందని ఎద్దేవా చేసారు. అధ్వాన్నంగా తయారైన రాష్ట్రంలోని పలు రోడ్లు.. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీపై హడావిడిగా రోడ్ల మరమ్మత్తులు చేపట్టడమే దీనికి నిదర్శమన్నారు. అనంతపురంలో కొత్తచెరువు , రాజమండ్రిలో ధవలేశ్వరం బ్యారేజ్‌ పై పాడైన రోడ్లును రాత్రికి రాత్రే వేసేశారని అన్నారు. రోడ్లు బాగుచేసే పనులు రెండేళ్ళుగా ఎందుకు చేపట్టలేదని దుర్గేష్‌ వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా రాజమండ్రిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనను విజయవంతం చేయాలని జనసైనికులకు.. పవన్‌ అభిమానులకు పిలుపునిచ్చారు. హుంకుంపేట జంక్షన్‌ లో పవన్‌ సభ, బాలాజీపేట రోడ్డులో శ్రమదానం కార్యక్రమాలు ఉంటాయన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు పవన్‌ కల్యాన్‌ రాజమండ్రి ఎయిర్‌ పోర్టు కు చేరుకుంటారని కందుల దుర్గేష్‌ తెలిపారు.

Comment here