Andhra PradeshEast GodavariNews

పార్టీ అధిష్టానం సమస్యను పరిష్కరించాలి

పార్టీ అధిష్టానం సమస్యను పరిష్కరించాలి
`సిఎం జగన్‌ రెక్కల కష్టం కాపాడుకోవాలి
`ఆరని చిచ్చుగా ఎంపి భరత్‌,ఎమ్మెల్యే రాజాల వివాదం
`విజ్ఞతతో ప్రవర్తించాలి
`బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు బర్ల సీతారత్నం

కోస్తా ఎన్‌ కౌంటర్‌, రాజమహేంద్రవరం సిటీ: రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య నెలకొన్న వివాదాన్ని తక్షణం పరిష్కరించే దిశగా వైసిపి అధిష్టానం చర్యలు తీసుకోవాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు బర్ల సీతారత్నం కోరారు. స్థానిక గణేష్‌ చౌక్‌ రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సీతారత్నం మాట్టాడుతూ ఎంపి భరత్‌,ఎమ్మెల్యే రాజాల మధ్య విభేదాల కారణంగా ప్రస్తుతం రాజమండ్రిలో వాతావరణం గందరగోళంగా మారిందని..కార్యకర్తలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కోన్నారు.
వైసిపి వర్గాలలోను.. ప్రజలలోను తమ వ్యక్తిగత పరువు మర్యాద మరచి వ్యవరిస్తున్నారా? అనే భావన బలపడుతుందన్నారు. అటు మార్గాని భరత్‌, ఇటు జక్కంపూడి రాజా తమ మనోభావాలను, వ్యక్తిగత గొడవలను ఇకనైనా పక్కకు పెట్టాలని హితవు పలికారు. ఈనాడు రాజకీయ నాయకులుగా పదవులు ఎవరెవరి శ్రమ ఫలితమో గుర్తించాలన్నారు. తమ కుటుంబాలు రాజకీయంగా ఎంతగా శ్రమిస్తే నేడు ఈ గౌరవ మర్యాదలు పొందారో తెలుసుకోవాలన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా సిఎం జగన్‌ రెక్కల కష్టం మరిచిపోకుండా.. పార్టీ మనుగడ గుర్తెరిగి తాము మసలుకోవాలని హితవు చెప్పారు. ఈ సమావేశంలో పల్లా లావణ్య, పల్లా లోవలక్ష్మి, దాసరి లక్ష్మి, బొమ్మన గౌరీ తదితరులు పాల్గొన్నారు .

Comment here