Andhra PradeshEast GodavariNews

పిల్లలను హతమార్చిన కసాయి కన్నతల్లిని కఠినంగా శిక్షించండి

పిల్లలను హతమార్చిన కసాయి కన్నతల్లిని కఠినంగా శిక్షించండి
కోస్త ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ;తన స్వంత ఇద్దరి పిల్లలను ఉరివేసి కిరాతకంగా చంపేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్న తల్లి పి.లక్ష్మి అనూషణు వివిధ సెక్షన్లు ప్రయోగించి కఠినంగా శిక్షించే విధంగా నగర పోలీసులు చర్యలు ముమ్మరం చేయాలని రాజమండ్రి నగర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(సీఆర్పీఎఫ్) కన్వీనర్ డాక్టర్ బోనిగి రమేష్ డిమాండ్ చేశారు
    సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రమేష్ మాట్లాడుతూ సోమవారం ప్రపంచమంతా అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుకుకుంటున్న సందర్భంలో రాజమండ్రి ఆనంద్ నగర్ లో జరిగిన పసివాడని పిల్లలను కర్కశంగా పొట్టన పెట్టుకున్న స్వంత తల్లిని చూసి సభ్య సమాజం విస్మయం వ్యక్తం చేస్తోందని ఆవేదన చెందారు,కన్న పిల్లలను అనువార్యకారణలతోని గానీ,కుటుంబ సమస్యలు ఇబ్బందులు వల్ల గానీ పెంపకానికి ఆసక్తి చూపడం ఇష్టం లేకుంటే రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు బాలల ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు దృష్టికి తీసుకెల్లాలని సూచించారు,వెంటనే వారు కుటుంబ సభ్యుల ఆమోదంతో ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని వారి ఉజ్వల భవితకు చేదోడు,వాదోడుగా ఉంటారని సూచించారు,అంతగాని ఇటువంటి దురదృష్ట కర ఘటనలు నెరిపి పిల్లల బంగారు భవితకు అడ్డంకిగా మారొద్దని పిలుపు నిచ్చారు,
    పిల్లలపై భవిష్యత్ లో ఇటువంటి దురదృష్ట కర ఘటనలుకు పాల్పడకుండా సమాజాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాలు నగర వ్యాప్తంగా చేపట్టేందుకు ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గొండు సీతారాం నేతృత్వంలో ప్రణాళికా యుతంగా అడుగులు వేస్తున్నామని డాక్టర్ రమేష్ చెప్పారు

Comment here