Andhra PradeshEast GodavariNews

*పీఠంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు*

*పీఠంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు*.

    *కోస్తా ఎన్ కౌంటర్, రాయవరం*: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 50వ శరన్నవరాత్రి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 08:28 నిమిషాలకు, కలశ స్థాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుతగా వేకువజామున వేద పండితులు చీమల కొండ వీరావధాని ,శ్రీనివాస్ అవధాని తదితర పండితులు విజయ దుర్గ అమ్మవారికి అభిషేకాలు, పుష్పార్చనలు, సహస్ర నామార్చన, హోమం తదితర పూజలు చేశారు. పీఠములో వేంచేసియున్న విజయ వెంకటేశ్వర స్వామి కి, సుబ్రమణ్యేశ్వర స్వామికి, గురు దత్త సాయిబాబా లకు, తదితర పరివార దేవతలకు అర్చనలు నిర్వహించారు. తొలిరోజు విజయ దుర్గ అమ్మవారని వెండి కవచాలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. విజయదుర్గా పీఠాధిపతి గాడ్ అమ్మవారి అవతారం మహిమ తెలుపుతూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి వి.బాపిరాజు, పిఆర్వో బాబి, గాదె. సత్య వెంకట కామేశ్వరి, భాస్కర నారాయణ, పి. సత్య కనక దుర్గ
 భక్తులు పాల్గొన్నారు. అనంతరం
 అన్న ప్రసాద వితరణ గావించారు

Comment here