Andhra PradeshEast GodavariNews

పీఠంలో దేవి శరన్నవరాత్రులకు రాట ముహూర్తం

*పీఠంలో దేవి శరన్నవరాత్రులకు రాట ముహూర్తం*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 49వ శరన్నవరాత్రి మహోత్సవాలు శుక్రవారం రాట ముహూర్తం పూజలు చేసి, పనులకు శ్రీకారం చుట్టారు. పీఠ బ్రహ్మలు చీమల కొండవీరావధాని, చీమలకొండ శ్రీనివాసా వధాని ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో గాడ్ కుమార్తె సత్య కామేశ్వరి, భాస్కరనారాయణ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాటను నెలకొల్పి ఉత్సవ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు ,పి ఆర్ ఓ వాడ్రేవు వేణుగోపాల్ (బాబి), విజయ దుర్గ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెద్దపాటి సత్య కనకదుర్గ పీఠం భక్తులు పాల్గొన్నారు.

Comment here