Andhra PradeshEast GodavariNews

అరవ పేట లో డెంగ్యూ విలయతాండవం..

అరవ పేట లో డెంగ్యూ విలయతాండవం..

* డెంగ్యూ జ్వరాలు ప్రజల్ని భయపెడుతున్నాయి
* ఇప్పటికే జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు
* ప్రతి వీధిలో నిలవ నీరు లో దోమలు
* స్పందించని అధికారులు

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం; మండలంలోని అన్నిచోట్ల డెంగ్యూ జ్వరాలు తో ప్రజలు బాధపడుతున్నారు, కరోనాతో పోరాడి చేయించమని ఆనంద పడుతున్న ప్రజలకు డెంగ్యూ మరో సవాల్ విసిరింది. మండలంలో ఏ గ్రామంలో చూసినా డెంగ్యూ జ్వరాలతో మనుషులు మొలుగుతూ.. మంచం పట్టారు.. జ్వరం వచ్చిందని తెలిసిన కొంతమంది రాజమండ్రి హాస్పిటల్ కి వెళ్లి చూపించుకున్నారు, తినడానికి తిండి లేని వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కురిసిన వర్షాలకు మరోపక్క సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, అరవ పేట లోని వీధులన్నీ మురికి గా మారాయి. ఎక్కడపడితే అక్కడ బురద తో నిండి ఉంది. ప్రతి ఇంట్లో జ్వరాలు వచ్చి కనీసం వైద్యం చేయించుకోవాలని పరిస్థితిలో ఉన్నారు, దీనికి తోడుగా బహిరంగంగానే పందుల సంచారం జరుగుతుంది. అరవ పేట ఏరియా లో అందరూ నిరుపేదలే. వారికి జ్వరాలు వస్తే ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు సంబంధిత అధికారులు అటు వైపు చూసిన దాఖలాలు లేవని స్థానికులు అంటున్నారు, డెంగ్యూ జ్వరాలకు కారణమైన దోమలను నివారించే  ప్రయత్నాలు అధికారులు చేయడం లేదని గ్రామస్తులు అంటున్నారు, పంచాయతీ సిబ్బంది వాళ్ళు వచ్చిన రోడ్లపైనే చెత్తను శుభ్రం చేస్తున్నారని కనీసం వీధి వైపు చూడడం లేదని అంటున్నారు. ఈ పేటలో రోజు ఒకళ్ళు ఇద్దరు రాజమహేంద్ర ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు, ఫ్రైడే డ్రై డే అన్న కార్యక్రమాన్ని అధికారులు పూర్తిగా మరిచారు. అధికారులు ప్రతి వీధుల్లో తిరిగి పరిశీలిస్తే వారి పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తుంది. డెంగ్యూ జ్వరం వచ్చి రక్త కణాలు తగ్గిపోవడంతో హాస్పటల్లో చేరుతున్నారు, కొంతమంది స్తోమత లేక ఇళ్ల వద్దనే మునుగుతూ.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డెంగ్యూ నిర్మూలన కు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు తెలిపారు,

Comment here