Andhra PradeshEast GodavariNews

పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ మురళిని సస్పాండ్ చెయ్యాలి…

పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ మురళిని సస్పాండ్
చెయ్యాలి…

అధికారులు చట్టప్రకారం వ్యవహరించాలి,

డి-ఫారం పట్టా భూములకు భూసేకరణ ప్రకటన జారీ చేయక పోవడం చట్ట విరుద్ధం

ఎస్.ఆర్ శంకరన్ వంటి అధికారులను స్ఫూర్తిగా తీసుకోవాలని

— న్యాయ సలహాదారులు అయినాపురపు సూర్యనారాయణ

కోస్తా ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ :

రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన ఆదివాసీ మహా సభ కమిటీ వారి
పాత్రికేయ మిత్రుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో న్యాయ సలహాదారులు ఆదివాసీ మహాసభ కమిటీ నాయకులు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ కొత్త భూసేకరణ చట్టం 2013 డి- ఫారం పట్టదారులను భూమి యజమాని గా పేర్కొంది. ఈ భూసేకరణ కూడా సెక్షన్ 11 ప్రకారం ప్రాధమిక ప్రకటన జారీ చేయవలసిఉంది.కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ పూర్తి చేయాలి. పొలవరం ప్రాజెక్ట్ లో భాగంగా డి-ఫారం భూములు భూసేకరణ జరిపుతున్నపుడు పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా చట్ట ఉల్లంఘన పాల్పడ్డారు.

గోకవరం మండలం కృషుని పాలెం లో ఎస్సి కులస్తులు డి ఫారం పట్టాల భూముల విషయం లోను తుని అర్బన్ లో ఎస్టీ కులస్తులు ఇచ్చిన డి ఫారం పట్టా స్థలాల లోని ఇండ్లను సేకరిస్తున్నప్పుడు భూసేకరణ అధికారి చట్టా విరుద్ధంగా వ్యవహరించి భూసేకరణ జరిపారు.2019 లో భూసేకరణ చేసినప్పటికీ ఇప్పటికి నష్టపరిహారం చెలించ లేదు .ఆర్ అండ్ ఆర్ కూడా కల్పించలేదు.ఈ చట్టాన్ని ఉల్లంఘించిన భూసేకరణ చట్టంలో ని సెక్షన్ 85 ప్రకారం నేరం.ఐ.పి.సి 409,166 ల ప్రకారం నేరం ఆర్టికల్ 300ఎ ప్రకారం నేరం,దేవి పట్నం మండలం లో గిరిజనులు వద్ద నుండి డి ఫారం పట్టాలను గతం లో భూసేకరణ అధికారి తిసుకెళ్ళారు.ఇప్పటికి భూసేకరణ నోటిఫికేషన్ ప్రచురించలేదు.నష్టపరిహారం కూడా చెల్లించలేదు.ఈ మేరకు ప్రభుత్వం విచారణ జరిపి పోలవరం భూసేకరణ ప్రత్యేక అధికారి కలెక్టర్ మురళి ని సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని, ఆదివాసీ మహాసభ ప్రభుత్యానికి విజ్ఞప్తి చేస్తుంది అని,చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రభుత్యం ప్రోత్సహించడం మానుకోవాలని,ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుంది.అలాగే

ఎస్ ఆర్ శంకరన్ వంటి అధికారుల ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ తరం అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అది వాసిలు మహా సభ డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహా సభ ప్రెసిడెంట్ అరగంటి వీరభద్ర రెడ్డి, సెక్రటరీ గిడుతూరి చిన్న రావు,కెచ్చేల అబ్బయ్య రెడ్డి పాల్గొన్నారు.

Comment here