Andhra PradeshEast GodavariNews

పౌష్టికాహారంతో పరిపూర్ణ ఆరోగ్యం

*పౌష్టికాహారంతో పరిపూర్ణ ఆరోగ్యం*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ తేతల వనజ నవీన్ రెడ్డి అన్నారు. మండలంలోని పసలపూడి గ్రామంలో రాయవరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవం వాలు ముగింపు కార్యక్రమం జరిగింది. సెక్టార్ సూపర్వైజర్ ఎం. పెర్సీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి అధ్యక్ష వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వజానవీన్ రెడ్డి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, పరిపూర్ణ ఆహారం తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు, ఉప సర్పంచ్ పోతంశెట్టి సాయి రామ్ మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు చింతా రామ్మోహన్ రెడ్డి, వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షులు చింత సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను అంగన్వాడీ కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం ప్రగతి రామారెడ్డి సౌజన్యంతో పదిమంది గర్భవతులకు శ్రీమంతాలు చేశారుు. ఇరువురు చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో మాచవరం సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి, లొల్ల సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు , పలు గ్రామాల ఎంపీటీసీలు, ప్రధానోపాధ్యాయులు కె. వెంకటరమణ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సునీత, వెర్నమ్మ, వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

Comment here