Andhra PradeshEast GodavariNews

*పౌష్టికాహారంతో పరిపూర్ణ ఆరోగ్యం*

*పౌష్టికాహారంతో పరిపూర్ణ ఆరోగ్యం*

*ఎంపీపీ నౌడువెంకటరమణ*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ నౌడు వెంకటరమణ సూచించారు. బుధవారం మండల కేంద్రమైన రాయవరం లో వేలంపేట అంగన్వాడీ కేంద్రము వద్ద ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ ,100మంది మహిళల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారన్నారు. దీన్ని అధిగమించేందుకు ఐరన్ అధికంగా ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. గర్భవతులు, బాలింతలు ఆహారం పట్ల మరింత శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం గర్భవతులు,బాలింతలకు , అటుకులు, రాగిపిండీ, జొన్నపిండి, ఒక్కొక్క కిలో చొప్పున, 250గ్రాములు ఖర్జురాం, బెల్లం, వేరుశెనగ చిక్కీలు ,25 గుడ్లు, 5లీటర్లు పాలు, 3కేజీల బియ్యము, 1కేజీ కందిపప్పు, 500గ్రాములు నూనె తో కూడిన వైయస్సార్ సంపూర్ణ ఆహారం కిట్లను ఎంపీపీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, వార్డు సభ్యులు తాడి రామచంద్రారెడ్డి, కొల్లి వెంకట రమణమ్మ, కొల్లి రాంబాబు, సెక్టర్ సూపర్వైజర్ సునీత, కోరుపురెడ్డి పద్మ, అంగన్వాడీ కార్యకర్త పాల్గొన్నారు

Comment here