Andhra PradeshEast GodavariNews

*పౌష్టికాహార మాసోత్సవం*

*పౌష్టికాహార మాసోత్సవం*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని సోమేశ్వరం గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవం జరిగింది. మాచవరం క్లస్టర్ సూపర్వైజర్ ఎం. పెర్సీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరిఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తల్లులు పౌష్టికాహారం తీసుకోకపోతే జరిగే అనర్ధాలు, తీసుకోవడం వల్ల లాభాలను అంగన్వాడీ కార్యకర్తలు గ్రామంలోని వారందరికీ అవగాహన కల్పించాలన్నారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు తల్లులకు యోగా, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంపై అవగాహన కల్పించారు. పోషకాహార ప్రదర్శన, ఫ్రీ స్కూల్ కిట్లు ప్రదర్శన చేశారు. వెయ్యి రోజుల సంరక్షణకు లబ్ధిదారులను నమోదు చేశారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాకా ఆదినారాయణ, వార్డు సభ్యులు నున్న గోపాలకృష్ణ, శాకాఫణి శంకర్ ,వైసీపీ నేతలు ధూళిపూడి వెంకటేశ్వరరావు, గరగ కామరాజు ,శాకా శ్రీను, పేకేటి దుర్గమ్మ, కాళ్ళ శ్రీనివాసరావు,ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Comment here