Andhra PradeshEast GodavariNews

పౌష్టికాహార మాసోత్సవాలు..

పౌష్టికాహార మాసోత్సవాలు..

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మండలం లో పౌష్టికాహార మాసోత్సవం పంచాయతీ కార్యాలయం ఆవరణలో విద్యార్థులతో అధికారులు జరుపుకున్నారు, వైద్యులు విద్యార్థులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారో అనే విషయాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఇందిరా కూరగాయలు ఎక్కువగా తింటే ఆరోగ్యం బాగుంటుందని అన్నారు, మన రాష్ట్రంలోని పిల్లలకు కిశోర బాలబాలికలకు మహిళలకు సరైన పోషణ పై అవగాహన కల్పించి పౌష్టికాహారలోపం తగ్గించి, వారిని ఆరోగ్యవంతులుగా దృఢంగా ఉండేలా తీర్చిదిద్దుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు, పరిశుభ్రమైన నీరు అలాగే వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత అనే విషయాలు అందరికీ తెలియజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సి.డి.పి.ఓ, సి.హెచ్ నర్సమ్మ, ఆరోగ్యంపట్ల విద్యార్థులకు మరిన్ని సూచనలు ఇచ్చారు, పౌష్టికాహారం అంటే ఏమిటి అనే విషయాలు విద్యార్థులందరికీ ఎంతో చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ డి ఇంద్ర రాణి, చంద్ర, రజిని, సి హెచ్ సి డాక్టర్ ఓవి ఇందిరా, ఎస్సై శివ నాగ బాబు, పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్, ఎన్ జి వో,  పి చంద్రకళ, సి హెచ్ ఓ మేరీ కృప, పి శైలజ, వైఎస్ రాయుడు, పవన్, రమణ, అంగన్వాడీ టీచర్స్ ఎం మాలతి, ఎన్ వి వి భాస్కర్ రావు, ఎం మాలతి, పాల్గొన్నారు,

Comment here