Andhra PradeshEast GodavariNews

ప్రజలతోనే ఉంటాం… వారి సమస్యలు దూరం చేస్తాం 

ప్రజలతోనే ఉంటాం… వారి సమస్యలు దూరం చేస్తాం
– 24వ డివిజన్ పర్యటనలో ఆదిరెడ్డి
కోస్త ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ :
తెలుగుదేశం పార్టీ ఏ పక్షంలో ఉన్నా తాము నిత్యం ప్రజలతోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వారు స్థానిక 24వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. ఎక్కువగా వ్యాపారాలు జరిగే ఈ డివిజన్కు నిత్యం లక్షలాది మంది వినియోగదారులు వస్తుంటారని, అందువల్ల పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డివిజన్ లో ప్రమాదకరంగా ఉన్న ఐరన్ విద్యుత్ స్తంబాలను తొలగించి సిమెంట్ స్తంబాలు వేయించాలని అధికారులను కోరారు. శిధిలమైన డ్రైనేజీలు, సీసీ రోడ్లను పున నిర్మించాలని కోరారు. డివిజన్ ప్రెసిడెంట్ కర్రి కాశీవిశ్వనాథం, టీడీపీ సీనియర్ నాయకులు ఛాన్ భాషా, బెజవాడ వెంకటస్వామి, రొక్కం వరలక్ష్మి, మేరీ, ముత్తా వెంకటేష్, కర్రి సూర్యనాయుడు, ఎం గణేష్, ఎస్కె కరీం, అజిత్, సూర్య, రవి, కిరణ్ తదితరులు వారి వెంట ఉన్నారు.

Comment here