Andhra PradeshEast GodavariNews

ప్రజలపై అధిక భారాలు మోపడం అన్యాయం

ప్రజలపై అధిక భారాలు మోపడం అన్యాయం

సామాన్య ప్రజలు రద్దు చేయడం హేయమైన చర్య,ప్రభుత్యం విఫలం,

– పెంచిన విద్యుత్, ఇంటి పనులు, ఇతర పన్నులు తగ్గించాలి

– ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ దశల వారి నిరసన కార్యక్రమాలు

– రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మళ్లీ టీడీపీదే

రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేతలు

కోస్తా ఎన్ కౌంటర్; రాజమహేంద్రవరం సిటీ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులను ఛిద్రం చేయడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. స్థానిక మెయిన్ రోడ్డులోని హెటల్ జగదీశ్వరిలో టీఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్ అధ్యక్షతన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టిఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ బాట పడుతున్నామన్నారు. విద్యుత్‌చార్జీలు, పెన్షన్ల రద్దు, చెత్త పన్ను పేరుతో ప్రజలపై పడుతున్న అదనపు భారాన్ని నిరోధించాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమ కార్యాచరణ చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తోందని, విద్యుత్ చార్జీలు పెంచి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ మోసాలపై ప్రజల్లో ఇప్పటికే చైతన్యం వచ్చిందని, జగన్ తీరుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని వారి తిరుగుబాటును ఎదుర్కొనే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తన తీరును మార్చుకుని ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోకపోతే గుణపాఠం తప్పదన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధంగానే ఉన్నామని, 4వ సారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ రెడీగానే ఉందని స్పష్టం చేసారు. ఈ నెలరోజులు పూర్తిగా ప్రజల మధ్యనే ఉంటామని వారి సమస్యలన్నింటిని పరిష్కరించేలా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సిఎం అన్న విషయాన్ని మర్చిపోయి నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, నాయకులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రధానంగా ఆలోచన చేసి సంపద సృష్టించే మాటను పక్కన పెట్టి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. నవరత్నాలకు ఖర్చు పెట్టడానికి ప్రజలపైనే భారం వేస్తూ ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, పెన్షన్, రేషన్ కార్డులు రద్దు చేసి, పనికి మాలిన పన్నులన్నీ వేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు అండగా నిలబడటానికి ప్రజల సమస్యలపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పెంచిన పన్నులన్నీ రద్దు చేసే వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమష్టిగా నాయకులందరూ పనిచేసి 4వ సారి మేయర్ పీఠాన్ని గెలుచుకోవడానికి కృషిచేయాలని కోరారు.
మందులు పంపిణీ :
కాగా ఆనారోగ్యంతో బాధపడుతున్న 31వ డివిజన్‌కు చెందిన షేక్ ఫాతిమా మనుమరాలు షేక్ మస్తానికి తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు తదితరులు మందులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతి సుందరి, కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, కార్యదర్శులు కడితి జోగారావు, మహబూబ్ ఖాన్, మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసూరి చండీప్రియ, ఇన్నమూరి రాంబాబు, తంగెళ్ళ బాబి, సింహా నాగమణి, కప్పల వెలుగుకుమారి, పాలవలస వీరభద్రం, నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, కుడుపూడి సత్తిబాబు, నల్లం శ్రీను, నక్కా దేవీవరప్రసాద్, పెనుగొండ రామకృష్ణ, జమ్మి సత్యనారాయణ, మజ్జి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, షేక్ సుభాన్, ఛాన్ భాషా, కరగాని వేణు, పితాని కుటుంబరావు, కంటిపూడి రాజేంద్రప్రసాద్, టిఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి యాళ్ల శ్రీనివాస్, ఈతలపాటి కృష్ణ. అగురు ధన్ రాజ్, గుణవర్తి శివ, యర్రంశెట్టి రాజ్‌కుమార్, బంగారు నాగేశ్వరరావు, జక్కంపూడి అర్జున్, సలాది ఆనంద్, సప్పా వెంకటరమణ, నాయుడు మాస్టారు, బండారు శ్రీనివాస్, అట్టాడ రవి, బొర్రా చిన్ని, వీరా రాము, నల్లం ఆనంద్, కర్రి కాశి, మొల్లి చిన్నియాదవ్, ఉర్లంకల లోకేష్, చింతపల్లి నాని, బేసరి చిన్ని, కవులూరి వెంకటరావు, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, తలపాటి రాంబాబు, పిడిపి ప్రకాష్, అర్జున్, వాసంశెట్టి సతీష్, కానేటి ప్రభు, కానేటి కృపామణి, చాపల చిన్ని రాజు, దుత్తరపు గంగాధర్, తుల్లి పద్మ, కెవి శ్రీనివాస్, శనివాడ అర్జున్, ఉమామహేశ్వరరావు, మండల విశేశ్వరరావు, హరి బెనర్జీ, సింహా వెంకటేష్, అర్జున్, వింజూరి సత్యనారాయణ, కందికొండ అనంత్, కర్రి సూర్యనాయుడు, ఇల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Comment here