Andhra PradeshEast GodavariNews

ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలి

ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలి

తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో బ్లీచింగ్‌ చల్లుతున్న దృశ్యం….
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : వర్షాలు కురస్తున్నందున ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలని జగన్నాథపురం సర్పంచ్‌ పొనుకుమాటి గౌరి అన్నారు. గురువారం మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గౌరి మాట్లాడుతూ ఎర్ర కాలువ వరద పోటెత్తడంతో గ్రామాల్లోకి నీరు చేరిందన్నారు. ఆ కారణంగా మురుగు నీరు, దోమలు ప్రబలే అవకాశం ఉందన్నారు. పంచాయతీ సిబ్బంది తూరలకు అడ్డుగా, కాలువ గట్టు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలను వేశారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం గ్రామంలో బ్లీచింగ్‌ చల్లించారు. పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comment here