Andhra PradeshEast GodavariNews

ప్రణాళికతో ముందుకు సాగుతున్న సీఎం జగన్‌

ప్రణాళికతో ముందుకు సాగుతున్న సీఎం జగన్‌
` ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ……
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : కేంద్రం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసి రాష్ట్ర ప్రగతికి ప్రణాళికతో ముందుకు సాగుతున్న నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అని ప్రభుత్వ హామీల అమలు కమిటి చైర్మన్‌, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాఅయణ అన్నారు. సోమవారం స్థానిక రామారావుపేటలోని తన నివాసంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు తనను అధికారానికి దూరం చేశారనే అక్కసుతో రాష్ట్ర ప్రజలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన తోక పార్టీ అని, వకీల్‌సాబ్‌లో మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి నిజ జీవితంలో విలన్‌గా మారారన్నారు. రూ.2లక్షల కోట్లు కుక్కల పాలు చేశారని చంద్రబాబు అనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కై ప్రభుత్వ సంక్షేమాలకు మోకాళ్ళు అడ్డుపెడుతుందన్నారు. 31లక్షల కుటుంబాలకు అన్యాయం జరిగితే మీరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కోర్టుల ద్వారా ప్రజలకు జరుగుతున్న అన్యాయం పవన్‌ కళ్యాణ్‌కు కనిపించడం లేదా ? వాటిని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కోర్టును తప్పుద్రోవ పట్టించారని, కేసులు పెట్టిన వారెవరు తాము కోర్టులకు వెళ్ళలేదని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఏఎంసీ డైరెక్టర్‌ కోడే శ్రీను, పెంటపాడు సర్పంచ్‌ తాడేపల్లి సూర్యకళ, వైసీపీ పట్టణాధ్యక్షుడు గుండుబోగుల నాగు తదితరులు పాల్గొన్నారు.

Comment here