Andhra PradeshEast GodavariNews

ప్రతి మహిళా సంక్షేమం కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి

ప్రతి మహిళా సంక్షేమం కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి

– వైఎ స్సార్ ఆసరా రెండో విడత సంబరాల్లో మేడపాటికోస్తా ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ; రాష్ట్రంలోని ప్రతి మహిళకు కొడుకుగా, అన్నగా నేనున్నానంటూ భరోసా కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని రుడా చైర్ పర్సన్ మేడపాటి శర్మిలా రెడ్డి అన్నారు. స్థానిక రాజమండ్రి 3వ వార్డు షాదీఖానా లో వైయస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 82 డాక్రా గ్రూపు సంఘాలకు 66 లక్షల 50 వేల రూపాయలు చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మహిళా సంక్షేమం ఆకాంక్షించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ, మహిళా అభ్యున్నతి కోరుకుంటున్నారని వై ఎస్ ఆర్ ఆసరా, వై.ఎస్.ఆర్ చేయూత, వై ఎస్ ఆర్ ఓబిసి నేస్తం వంటి పథకాలు మహిళల ఆర్థిక అభివృద్ధికి సహాయపడతాయని అన్నారు. ఆసరా కార్యక్రమం ద్వారా అక్టోబర్ 18 వరకు అన్ని గ్రూపులకు వైయస్సార్ ఆసరా లబ్ది అందుతుందని తెలియజేశారు. దసరా కానుకగా నవరత్నాలలో భాగంగా ఈ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాల అక్కా చెల్లెమ్మలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సీవో, 6 ఆర్ పి ఎస్ డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు

Comment here